424
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దైవోగ్రమునకు బాత్రుడను విమల భావమునకే నసహ్యుడను గావరించిన పాప కర్ముడన్ కఠినుడన్ జానవలసిన యట్టి స్వామి ద్రోహు డ నయ్య ||శరణు||
- మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగ బాపముల్ వేడ్కను జేసితి ||శరణు||
- మోసంబులో జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని సిలువ నేమాత్రమైన నే నాసతో జూడని యన్యాయ పరుడను ||శరణు||
- నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలో ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారగ సమ్మతము దొరక దో సర్వేశ నీకంటె ||శరణు||
- నా తండ్రి యో యేసునాధా నిన్ను ఘాతజేసిన దేనుగాదా నీతిమాలిన పాప నీచుడన్ దుష్టుడన్ నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు ||శరణు||
- కడుదయా శాంతస్వభావా నన్ను దడవుజేయక యేలుకోవా యొడబడి కుజనులకై యోర్చియలసటను బడి జీవమిడిననా ప్రాణ రక్షక కావు ||శరణు||
إرسال تعليق