a423

423

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సర్వశక్తుడ నిర్మలాత్ముడ సర్వజనసంరక్షకా మా సర్వపాపము బరిహరింప నీ సర్వమహిమను విడితివా ||సర్వ||

  1. నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపము బాపి మరి నీ నిత్య జీవము మాకునీయను మృత్యు బాధలు పడితివా ||సర్వ||

  2. పాపమరణపు బంధకములను దెంపి మము విడిపించుటకు మా పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా ||సర్వ||

  3. మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిక నీ కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ ||సర్వ||

  4. సత్యవిధులలో నడువనే న శక్తుడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి నడి పింపు నీ ఘనసేవలో ||సర్వ||

  5. నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు సాధు నిగ నను జేసి సాయము నాధుడా నాకీయుమా ||సర్వ||

  6. ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుజేతు నీ స్తోత్రముల్ పర వస్తు ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్ ||సర్వ||

  7. ముక్తినుంచి నీవు రాగా శక్తితో ప్రభు యేసువా యా సక్తితో నిను గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము ||సర్వ||

Post a Comment

أحدث أقدم