405
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుడే||
- దేవు డెప్డు తోడుగాగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుడే||
- రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరి బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుడే||
- విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి రిపుల నెల్లద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుడే||
- పిశాచి పూర్ణబలము నాతో బెనుగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ ||దేవుడే||
- కోటయు నాశ్రయమునై యా కోబు దేవు డుండగ ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకు బండుగ యభయ మభయ మభయ ||దేవుడే||
కామెంట్‌ను పోస్ట్ చేయండి