మానవుల మేలు కొరకు జ్ఞానియైన

563

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుడు మానుగ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల||

  1. కానాయను నూరిలో మన కర్త చూచె బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసగె బ్రీతిని ||మానవుల||

  2. యేసూ వీరిద్దరిని ఏకముగా జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల||

  3. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరి బొందుగాను నడుపుమీ ||మానవుల||

  4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల జేయుమీ ||మానవుల||

Post a Comment

కొత్తది పాతది