564
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర||
- ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర||
- ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర||
- తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపద లన్నియు బాపుచును ||దేవర||
- సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర||
- మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర||
- ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||
- వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడౌ యేసుని పేరిట బ్రోవు మామేన్ ||దేవర||
]]>
కామెంట్‌ను పోస్ట్ చేయండి