562
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబు బాపి యిపుడు ||కానా||
- దయ నుంచు మయ్య యీ దంపతులమీద దయుడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||
- ఒప్పు మీరగ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||
- చక్కగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||
- పిల్లలను నీవొసగ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||
కామెంట్‌ను పోస్ట్ చేయండి