కానాపురంబులో గడు వింతగా నీరు

562

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కానాపురంబులో గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

  1. రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబు బాపి యిపుడు ||కానా||

  2. దయ నుంచు మయ్య యీ దంపతులమీద దయుడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||

  3. ఒప్పు మీరగ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||

  4. చక్కగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||

  5. పిల్లలను నీవొసగ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||

Post a Comment

أحدث أقدم