516
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసు||
- మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి బిడ్డల నాదరముతో బంపరే ||యేసు||
- యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసు||
- యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి హృదయము యేసురూపము దాల్చును ||యేసు||
- యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి