515
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పూర్ణ ప్రేమను జూపరే గృహమున క్రీస్తును పూర్ణ ప్రేమను జూపరే పూర్ణ హృదయముతోను పూర్ణయాత్మతో మరి ప్ర పూర్ణ శక్తితో జూపరే క్రీస్తునిలో సం పూర్ణులగుటకు సాగరె ||ప్రభువు||
- భక్తితోడను గొల్వరే గృహమున క్రీస్తున్ భక్తితోడను గొల్వరే ముక్తినాధుడు తన స్వ రక్తమీయను మనకై రిక్తుడాయెను జూడరే ముక్తిదాతను నా సక్తితో గొనియాడరే ||ప్రభువు||
- నమ్మకస్థులై యుండరే గృహమున క్రీస్తుకు నమ్మకస్థులై యుండరే అమ్మహాత్ముని నామ మిమ్మహిన్ దగజాటన్ నమ్మె మిమ్మును జూడరె సమ్మతిన్ గ్రీస్తున్ నమ్మకంబుగ జాటరె ||ప్రభువు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి