దానియేల్వలె సాహసించుడి

525

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలె సాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యము గలిగి దీనులై యా దృఢ కార్యం బిక బూని తెల్పను సాహసించుడి ||దానియేల్||

  1. నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెల గ్రక్కున గైకొను జనములగాంచి చక్కగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరు పించుచు మిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుడీ ||దానియేల్||

  2. ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనబడువా రనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమది వారలే ప్రభుదేవుని భట పరి వారమునబడి యుందురు నిజ మిక ||దానియేల్||

  3. కాన నీ సువిశేషమును జెండ పైకెత్తుడీ సై తానుని నెదిరించను రండి దీనిని దీని శ్రేణులను యు ద్ధానికి రారమ్మని పిలిచి దానియేల్సంఘము పక్షమున బూని జయధ్వనులను జేయుటకై ||దానియేల్||

Post a Comment

కొత్తది పాతది