526
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు నేను ||యేసువలెను||
- భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై నేను ||యేసువలెను||
- సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు నేను ||యేసువలెను||
- ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై నేను ||యేసువలెను||
- ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు పైకి జూతును నేను ||యేసువలెను||
- నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో నేర్తును ||యేసువలెను||
- వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున నేను ||యేసువలెను||
కామెంట్‌ను పోస్ట్ చేయండి