కాపరి మెచ్చిన సుందరి ఘనురాలు షూలమ్మితి పావన చరిత గుణవతి

కాపరి మెచ్చిన సుందరి ఘనురాలు షూలమ్మితి ''2''
పావన చరిత గుణవతి
పావురము షూలమ్మితి ''2''
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ''4''

సత్యమైన సూర్యకళలు సంధ్యా రాగ కవళికలు ''2''
చంద్రబింబ సౌందర్యం సాంద్రమున నిండిన సతి ''3''
''కాపరి''
ప్రియ కాపరి యేసు రాజు ప్రేమిక షూలమ్మితి ''2''
సంఘ వధువు తనకెంతొ సంతసమిడు బహుమతి ''3'' ''కాపరి''
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి షూలమ్మితి ''2''
ప్రేమ కావ్య రస వాహిని శ్రీ యేసుని శ్రీమతి ''3''

కాపరి మెచ్చిన సుందరి ఘనురాలు షూలమ్మితి ''2''
పావన చరిత గుణవతి
పావురము షూలమ్మితి ''2''
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ''2''

Post a Comment

కొత్తది పాతది