స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున

584

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతో జేసిన యన్ని మేలులు దలచి ||స్తుతి||

  1. ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుగు చున్న నీ పద సన్నిధిన్ సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ చెన్నౌ నీ గృహమందు ||స్తుతి||

  2. ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్ శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక ముగ నిమ్ము ||స్తుతి||

  3. భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు ||స్తుతి||

  4. జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుడా దీవెన మాపై కుమ్మరింపుము వేగ ||స్తుతి||

Post a Comment

కొత్తది పాతది