584
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుగు చున్న నీ పద సన్నిధిన్ సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ చెన్నౌ నీ గృహమందు ||స్తుతి||
- ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్ శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక ముగ నిమ్ము ||స్తుతి||
- భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు ||స్తుతి||
- జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుడా దీవెన మాపై కుమ్మరింపుము వేగ ||స్తుతి||
إرسال تعليق