ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని

585

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె దీవెనలు ఆశీర్వాదము లరుదగును ||ఈ గుడి||

  1. ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ భూమియును పీఠముగా నొప్పును సుమ్ము ||ఈ గుడి||

  2. ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై ||ఈ గుడి||

  3. నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన సువార్తికుల బోధను నాటగ జేయుటకు ||ఈ గుడి||

  4. ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు ||ఈ గుడి||

  5. ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు ||ఈ గుడి||

  6. బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు ||ఈ గుడి||

  7. తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన వర్షములు దీనిపై నిరతము కురియుగాక ||ఈ గుడి||

Post a Comment

أحدث أقدم