యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును
నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకిత్తు నా సమస్తము
1. యేసు సామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే
2. నేను నీవాడను యేసు నీవును నావాడవు
నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము
౩. నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి
నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే
4. యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా హాల్లెలూయా స్తోత్రము
కామెంట్‌ను పోస్ట్ చేయండి