a94

94

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను||

  1. సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను||

  2. పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను||

  3. దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమాను||

  4. ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమాను||

Post a Comment

కొత్తది పాతది