89
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్త జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా||
నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబు బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుబడయును ||వందనమయ్యా||
శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుజంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
కామెంట్‌ను పోస్ట్ చేయండి