a77

77

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే వృజిన మంతటి మీద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ||

  1. మంగళముగ యేసుడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరగదన రక్తబలము వలన పొంగు నణగజేసెను సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను||విజయ||

  2. పాపముల్ దొలగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను పాప మెరుగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను||విజయ||

  3. సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ జేసిన వానికి కొలువుజేతుమెగాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు||విజయ||

Post a Comment

కొత్తది పాతది