a53

53

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఈ సాయంకాలమున యేసు ప్రభో వేడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముగావు ||మీ||

  1. చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ||

  2. దుష్టుండౌ శోధకుని ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండ గాపాడు ||మీ||

  3. నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ||

  4. జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబు జేయు మామేన్ ||ఈ||

Post a Comment

కొత్తది పాతది