a493

493

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||

  1. పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్ ||జీవము పోవగన్||

  2. నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్ ||జీవము పోవగన్||

  3. నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును ||జీవము పోవగన్||

  4. పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా ||జీవము పోవగన్||

  5. యేసుడు లేచెన్ దాసుడు లేచున్ భాసుర గృహమున వాసము చేయున్ ||జీవము పోవగన్||

Post a Comment

కొత్తది పాతది