49
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||
నీ మహదాశ్రయ మొసగి దుర్గతిని నేబడకుండగను నా మది తన్వాది సమస్తముతో నను గావవె ప్రభువా ||వినవే||
ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే||
పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుగ నీ పాద సరోజము నా కొసగుము నాపై నీ కృప జెలగ ||వినవే||
నీ కొరకై నా మనము దృఢంబౌ గాక యేసు ప్రభువా నాకు బిశాచముచే భ్రమ జన్మము గాకుండగ నేలు ||వినవే||
కామెంట్‌ను పోస్ట్ చేయండి