a46

46

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్పగ నభి దనంబులగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా||

  1. ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీకటులుబో దరిమి శాంతంబైన మనసుల దయబ్రసాదింపను భజింతుము ||ప్రభువా||

  2. అనఘా నీ సాన్నిధ్యమున నుండగా మా దుర్శనసుల నరి కట్టుమో దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుద లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను బనిచి తుదకు బ్రసన్నమగుము ||ప్రభువా||

  3. పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనగూర్ప నడిపించుమో దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ వనటజెందక నేది జేసిన బ్రభువు కొఱకని చేయ నడుపుము ||ప్రభువా||

Post a Comment

కొత్తది పాతది