a452

452

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సమృద్ధి జీవము సంపత్తి నాకుగా సంతప్త మొందుచు చావును బొందితి నాకై చావొందితి నీకై యేమి చేతున్?నెమ్మయిన రాజ్యము నేనొందు లాగున నీ నెత్రు కార్చుచు నీ ప్రాణ మిచ్చితి నా యాత్మ బ్రోచితి నీకేమి యిత్తును?నీ తండ్రి యింటిని నీ సింహాసనమున్ నీ గౌరవంబును నీ వన్ని మానితి యన్ని త్యజించితి నీ కేమి త్యజింతున్?నాశంబునుండి నన్ రక్షించుటకును లెక్కింప శక్యము కాని విచారమై నీ శ్రమ లోర్చితి నీకై నేనోర్తునా?నా పాప మన్నింపున్ రక్షణ్య మార్గము అక్షయ భాగ్యము నాశించి తెచ్చితి నా కన్ని తెచ్చితి నీకేమి తెచ్చెదన్?

Post a Comment

కొత్తది పాతది