440
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ జేతు లివిగో యనయంబు నీ విషయ మై సొగసుగా జురుకు దనముతో బరుగెత్త వినయ పాదము లివిగో ||తనువు||
- స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో బరి పూర్ణముగ నింపు ||తనువు||
- వెండి పసిడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడ బరి మితయౌ జ్ఞానం బిదిగో ||తనువు||
- నా యిష్ట మిదిగో యిది నీ యిషముగ జేయ నా యిష్ట మిక గాదది నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ కీయ సింహాసనమౌ ||తనువు||
- ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నడు ధార వోయన్ నన్ను నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ నుండెద ||తనువు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి