a432

432

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు, మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్ నీవు మమ్మును బోషించు మమ్ము జేర్చు మందలోన్ యేసునాధా, ప్రియనాధా! మిమ్ము విమోచించుమా.మమ్ము నాదరించు యేసూ మాకు పాలకుండవు పాప మార్గమందు నుండి ప్రేమతో! దప్పించుమీ యేసునాధా, ప్రియనాధా! మొఱ్ఱ నాలకించుమా.బీద పాపు లైన మమ్ము నీ వంగీకరింతువు మమ్మును బవిత్రపర్చి మమ్ము విడిపించుమీ యేసునాధా, ప్రియనాధా! నిన్ను నాశ్రయింతుముబాల్యమందు నిన్ను జేరి నిన్ను హత్తుకొందుము ప్రియ రక్షకుండ, యేసూ నీ ప్రేమ జూపుమా యేసునాధా, ప్రియనాధా! మమ్మింక బ్రేమించుమా.

Post a Comment

కొత్తది పాతది