403
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పెక్కు పాపములలోన మణగి నాదు తక్కువ బుద్ధిచే నందణగి దిక్కు గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరము జూచి చక్కికి జేర్చి ప్రోచె ||పాడుదును||
- మోసపు లోక వాంఛలను వట్టి యాశలతో గూడికొన్న కలలు రోసితి గాన వాని యేసుతో గూడుకొంటి వీసమైనను లేమి లేశము లేదనుస్వామి ||పాడుదును||
- పాయ నెన్నటికిని వాసిగా బాస త్రోయను త్రోయను యని చేసెగా రోయక న న్నావిభుడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు మాని యాయనే జయంజయమని ||పాడుదును||
- చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి నగుపరచినట్టి జాలినే గంటి గాన ||పాడుదును||
- ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని శరణం నాశరణమని ||పాడుదును||
కామెంట్‌ను పోస్ట్ చేయండి