a37

37

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్క డెవ్వడు? అతండె గెల్పుపొందుప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు? ఈ లోకాధిపుడుగ్రుడైనను దానేమి చేయు? దీర్పొందె నతడు నశించు మాటతోనే.వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేడు. దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.

Post a Comment

కొత్తది పాతది