31
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నిత్యుడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||
పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||
కెరూబుల్ సెరూపుల్ నిన్ను గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||
మా మహా జనకా నిను మాన్యుడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||
నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావగ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివి దెరచితివే ||ఓ||
నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకు దోడ్పడు మిపుడే ||ఓ||
నిత్య మహిమములో నిక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారల గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|
ఓ ప్రభువా పాపములో నుండ కుండగ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మము గరుణించుము దయతోడన్ ||ఓ||
ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకు బ్రేమ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి