కోత యజమానుండ స్తోత్రము గూర్మితో

581

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కోత యజమానుండ స్తోత్రము గూర్మితో నొనరింతుము ప్రీతి మీర గ మాదు పొలములు పెరిగి పండెను గావున ||కోత||

  1. నీదు సేవకులైన వారలు నిండు మోదము నొందుచు నీ దయ నొక యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోత||

  2. విత్తుకాలము కోతకాలము విమలమైన తలంపులు చిత్తమున బుట్టించి మాకతి క్షేమ మొసగితి రక్షకా ||కోత||

  3. వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోత||

  4. జల సమాధిని వెడలి చక్కగ బలముతో నీ గింజలు బలుడు దేవుని శక్తి చేతను బాగుగను ఫలియించెను ||గోత||

  5. ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు మహిమను నంద జేయుము రక్షకా ||కోత||

  6. కోత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగ జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోత||

  7. దూత లంత్య దినంబునందున కోత గోయుదు రంతట నా తరుణ మున గురుగు లన్నియు నగ్నిలో బడవైతురు ||కోత||

  8. లోకమందలి గాలి వానల లోను మే మిక నుండక నాకమందున దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోత||

  9. నీవు నేర్పిన యట్లే మే మిల నిన్ను బ్రతిదినమందును జీవనోపాయంపు భుక్తిని ద

Post a Comment

కొత్తది పాతది