జయించిన యేసయ్య నీ తోడు చాలు

    జయించిన యేసయ్య నీ తోడు చాలు
    బలహీనతలో నీ కృప చాలు
    లోకమంత ఒకటై నను వేరుచేసినా
    అక్షయతను కోరే నీ చెలిమి చాలు
    నీతోడు చాలయ్యా - నాకు నీ కృప చాలయ్యా

    పాపలోక అగాధాలలో పడనీయక చేయి పట్టి
    స్వార్థ ప్రియుల లోకములో స్నేహబంధమైనావు
    ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను
    నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను || జయించిన ||

  1. అంధకార లోకమందు నా వెలుగు దీపమై
    హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు
    ఆదుకున్న ఆశ్రయుడ నిన్ను మరువలేను
    నీతోడు లేకుండ నేను బ్రతుకలేను || జయించిన ||

  2. నీళ్ళు లేని ఎడారిలో జీవజలము నీవై
    నిలువ నీడలేని నాకు నిత్య నివాసమైనావు 2
    నీడని చ్చిన నిఖిలేశ్వరుడా నిన్ను మరువలేను
    నీతోడు లేకుండ నేను బ్రతుకలేను || జయించిన ||

Post a Comment

కొత్తది పాతది