జయహో జయహో జైత్ర యాత్ర

    జయహో జయహో … జైత్ర యాత్ర జయభేరి మోగింది చూడు...
    యేసుని వెంబడించగా ... విజయమే వరించింది చూడు...
    జయహో జయహో … జైత్ర యాత్ర జయభేరి మోగింది చూడు...
    ॥ పల్లవి ||
    క్రైస్తవ జీవితం ఒక సుదూర ప్రయాణం
    క్రీస్తును పోలి అడుగెయ్యమనే సందేశం
    దొరకునుగా పరలోక రాజ్య స్థానం
    ధన్యమౌనుగా... తరియించునుగా నీ జన్మం

    సంసార సాగరంలో తుఫానులే ఎదురైనా... కష్ట నష్టాలే క్రుంగదీసినా...
    యేసుని మాటతో శాంతము... యేసుని వాక్కులో సమాధానము... (2)
    సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం

    నెమ్మది గల మనస్సులో అలజడులే చెలరేగినా... ఆరోగ్యమే క్షీణించినా...
    యేసుని సన్నిధిలో ధైర్యము... యేసుని రక్తములో స్వాస్థ్యము... (2)
    సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం

    ప్రాణమనుకున్న స్నేహితులే వంచించినా... కన్నీటి పాలు చేసినా...
    ప్రాణమర్పించిన యేసునితో స్నేహము... యేసుని ప్రేమలో ఓదార్పు... (2)
    సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం