జాగోరే జాగోరే జాగు జాము రాతిరి

    జాగోరే జాగోరే జాగు జాము రాతిరి
    యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2)
    కన్నియ మరియ కన్నులు విరియ
    పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన          ||జాగోరే||
    దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది
    తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2)
    వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2)
    ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా          ||జాగోరే||
    వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా
    బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా (2)
    పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా (2)
    ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా            ||జాగోరే||