గీతములు పాడుడి యేసునికి సం గీతములు


    గీతములు పాడుడి - యేసునికి సం - గీతములు పాడుడి పాతకుల
    మగు మనల దారుణ - పాతకము తన విమలరక్త - స్నాతులనుగా జేసి
    పాపను - భాతకులలో నవతరించెను ||గీతములు||
    రాజులకు రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా బూజలందుచు
    దూత పరిగణ - పూజితుండౌ ఘనుడు తన దాగు - తేజ మెల్లను విడిచి
    యీయిల - దేజహీనులలోన బుట్టెను ||గీతము||
    దాసులగు వారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ జేసి వారల
    నెల్ల మోక్ష ని - వాసులుగ జేయంగ రక్తము - బోసి కృపచేగావ వచ్చెను
    - యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు||
    మానవుల కెల్లను - దేవుని ప్రేమ - మానుగా పను మ్రానిపై దన
    రక్త మొసగగ - మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేదా -
    దీనుడై యిమ్మానుయేలు ||గీతములు||
    ఆది దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన - మేదినిందా
    మనుజుడై యిక - సాదరమ్మున బ్రోవ మనుజుల - నా దయాళుడు
    తనదు దేహము - సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||