Vijaya sheeluda na prana priyuda విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా

Song no: 185
    విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా}
    కృతజ్ఞతతో నిను స్తుతించెదను}॥2॥
    నా యేసయ్యా నిను వేడుకొనగా}
    నా కార్యములన్నియు సఫలము చేసితివి }॥2॥ || విజయశీలుడా ||

  1. అలసిన సమయమున}
    నా ప్రాణములో త్రాణ పుట్టించినావు }॥2॥
    ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి}
    ధైర్యముతో నింపినావు}॥2॥
    నిత్యానందము కలిగించే నీ}
    శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి}॥2॥ || విజయశీలుడా ||

  2. ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి }
    విడుదల కలిగించినావు}॥2॥
    అరణ్య మార్గమున విడువక తోడై}
    విజయముతో నడిపినావు}॥2॥
    నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి}
    వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా}॥2॥ || విజయశీలుడా ||

  3. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో}
    ఆశ్రయమిచ్చితివి నాకు}॥2॥
    అక్షయుడా నా సంపూర్ణతకై}
    మహిమాత్మతో నింపినావు}॥2॥
    నిత్యము నీతో నేనుండుటకై}
    నూతన యెరూషలేము నిర్మించుచున్నావు }॥2॥ || విజయశీలుడా ||


Blogger ఆధారితం.