Nirantharam neethone jeevimchalane నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల

Song no: 115

    నిరంతరం నీతోనే జీవించాలనే
    ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
    నాప్రాణేశ్వరా యేసయ్యా
    నా సర్వస్వమా యేసయ్యా || నిరంతరం ||

  1. చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
    నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
    పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై || నిరంతరం ||

  2. నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
    నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
    పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై || నిరంతరం ||

  3. తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
    నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
    పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై || నిరంతరం ||

    Niramtaram nitone jivimchalane asa nannila bratikimchuchunnadi
    Napranesvara yesayya na sarvasvama. . .yesayya

    1. Chikatilo nenunnappudu ni velugu napai udayimchenu
    Nilone nenu velagalani ni mahima nalo nilavalani (2)
    Parisuddhatma abishekamuto nannu nimpuchunnavuni rakadakai

    2. Ni rupamu nenu kolpoyina ni raktamuto kadigitivi
    Nitone nenu nadavalani ni valene nenu maralani (2)
    Parisuddhatma varamulato alamkarimchuchunnavu nirakadakai

    3. Tolakari varshapu jallulalo ni polamulone natitivi
    Nilone chigurimchalani nilone pushpimchalani (2)
    Parisuddhatma varshamuto sidda parachuchunnavu nirakadakai
Blogger ఆధారితం.