Naa hrudhayamulo nee matale na kanulaku నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు

Song no: 176

    నా హృదయములో నీ మాటలే 
    నా కనులకు కాంతిరేఖలు 2
    కారు చీకటిలో కలువరి కిరణమై
    కఠినహృదయమును కరిగించినావు
    నీ కార్యములను వివరింపతరమా ?
    నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో ||

  1. మనసులో నెమ్మదిని కలిగించుటకు
    మంచువలె కృపను కురిపించితివి2
    విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు
    నీరు పారేటి తోటగా చేసి
    సత్తువగల భూమిగా మార్చినావు
    నీ కార్యములను వివరింపతరమా ?
    నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో ||

  2. విరజిమ్మె ఉదయకాంతిలో
    నిరీక్షణ ధైర్యమును కలిగించితివి 2
    అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు
    ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు
    నీ కార్యములను వివరింపతరమా ?
    నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో ||

  3. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు
    పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు
    సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు
    నీ కార్యములను వివరింపతరమా ?
    నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో ||
Blogger ఆధారితం.