Nithyuda nee sannidhi ninduga na thodu నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడూ

Song no: 24
    నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
    నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2

  1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
    నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2
    నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥

  2. నీ సన్నిధిలో - నా హృదయమును
    నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2
    నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥

  3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
    నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2
    నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2                       ॥ నిత్యుడా ॥

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.