Kalyana veduka ramaniya geethika కళ్యాణ వేడుక రమణీయ గీతిక


శుభప్రద ఆశాదీపికసుమధుర స్వరమాలిక 
క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక 
నూతన జీవిత ప్రారంభ వేదిక 
1
వివాహ వ్యవస్థను చేసిన దేవుడు
మొదటి వివాహము జరిగించినాడు 
సంఘ వదువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు 
ఈనాటి పెళ్ళికి కారణభూతుడు 
కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 
2
ఒకరికి ఒకరు సహకారులుగా
సంతోషముతో ఇల జీవించగా 
సంతానముతో దీవించబడగా 
సహవాసములో సంతృప్తి చెందగా 
పరిశుద్ధుడే కలిపె ఇరువురిని ఒకటిగా 
3
కిలకిల రవళుల వీణెలు మ్రోగెను
ఆనంద లహరుల సందడి సాగెను 
పరలోక దూతల సంతోష గానాలు 
బంధుమిత్రుల అభినందన మాలలు 
జంట కనులలో వెలిగే కాంతులు