ఉదయించెను నాకోసం

    ఉదయించెను నాకోసం - సదయుడైన నిజదైవం
    పులికించెను నా హృదాయం - తలపోయగ యేసుని జన్మం
    అ.ప. : సంతోషం పొంగింది - సంతోషం పొంగింది - సంతోషం పొంగి పొర్లింది
    కలుషమెల్లను బాపను - సిలువప్రేమను చూపను
    దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
    భీతిని తొలగించను - నీతిని స్థాపించను
    దోష శిక్షను మోయను - త్రోవ సిద్ధాము చేయను.