ఇమ్మనుయేలు దేవుడా నను గన్న దేవుడా

    ఇమ్మనుయేలు దేవుడా - నను గన్న దేవుడా
    ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా
    మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా
    లాలి లాలి లాలమ్మ లాలి... లాలి లాలి లాలి జో లాలి
    మా పాపము బాప  - పరమున మము చేర్చగా
    దివిని వీడి భువికి దిగిన దైవ తనయుడా
    ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా
    మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా
    లాలి లాలి లాలమ్మ లాలి... లాలి లాలి లాలి జో లాలి
    అశాంతిని తొలగించి - శాంతిని నెలకొల్పెగా
    ప్రేమరూపుడై వెలసిన - బాలయేసువా
    ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా
    మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా
    లాలి లాలి లాలమ్మ లాలి... లాలి లాలి లాలి జో లాలి