E dhinam sadha naa yesuke somtham ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత

Song no:
    ఈ దినం సదా నా యేసుకే సొంతం
    నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును } 2
    రానున్న కాలము – కలత నివ్వదు } 2
    నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును || ఈ దినం ||

  1. ఎడారులు లోయలు ఎదురు నిలచినా
    ఎన్నడెవరు నడువని బాటయైనను } 2
    వెరవదెన్నడైనను నాదు హృదయము } 2
    గాయపడిన యేసుపాదం అందు నడచెను } 2  || ఈ దినం ||

  2. ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
    యుద్ధకేక నా నోట యేసు నామమే
    విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
    యెహోవా నిస్సియే నాదు విజయము || ఈ దినం ||


కొత్తది పాతది