Song no:
కృప సత్యసంపూర్ణుడ నా యేసయ్య
}
నిన్ను పాడి పొగడెదనయ్య నజరేయుడా }॥2॥
నజరేయుడా నా గలలీయుడా ॥2॥
నజరేయుడా నాదు గలలీయుడా
॥కృపా సత్య ॥
1॰
వాక్య ప్రణవ రూపమా దివ్య లోక తేజమ }
దివి వీడి భువికరుదెంచిన మహిమ రూపమా }॥2॥
దినమెల్ల పాడిన వేనోళ్ల పొగడినా }
నా ఆశ తీరదు నా దైవమా }॥2॥
॥నజరేయుడా॥ ॥కృపా సత్య॥
నిన్ను పాడి పొగడెదనయ్య నజరేయుడా }॥2॥
నజరేయుడా నా గలలీయుడా ॥2॥
నజరేయుడా నాదు గలలీయుడా
॥కృపా సత్య ॥
1॰
వాక్య ప్రణవ రూపమా దివ్య లోక తేజమ }
దివి వీడి భువికరుదెంచిన మహిమ రూపమా }॥2॥
దినమెల్ల పాడిన వేనోళ్ల పొగడినా }
నా ఆశ తీరదు నా దైవమా }॥2॥
॥నజరేయుడా॥ ॥కృపా సత్య॥
2॰
అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు }
ఆశతీర నీదు కొలిచెదను ఆత్మరూపుడా }॥2॥
ఆదరణ కర్త నీవై నన్నాదరించావు }
ఆత్మాభిషేకముతో బలపరచినావు }॥2॥
॥నజరేయుడా॥ ॥కృపా సత్య॥
అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు }
ఆశతీర నీదు కొలిచెదను ఆత్మరూపుడా }॥2॥
ఆదరణ కర్త నీవై నన్నాదరించావు }
ఆత్మాభిషేకముతో బలపరచినావు }॥2॥
॥నజరేయుడా॥ ॥కృపా సత్య॥
3॰
నిత్యుడైన దేవుడవు నీతి స్వరూపుడవు }
నిన్న నేడు ఏకరీతిగ ఉన్నవాడవు }॥2॥
నీ ప్రేమ చాటగా మనసార పాడగా }
నా బాష చాలదు నా దైవమా }॥2॥
॥నజరేయుడా॥ ॥కృపా సత్య॥
నిత్యుడైన దేవుడవు నీతి స్వరూపుడవు }
నిన్న నేడు ఏకరీతిగ ఉన్నవాడవు }॥2॥
నీ ప్రేమ చాటగా మనసార పాడగా }
నా బాష చాలదు నా దైవమా }॥2॥
॥నజరేయుడా॥ ॥కృపా సత్య॥