ప. వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ ఏసయ్య కోరింది మనలో మార్పునేకథా ఇంటికి రంగులుకాదు వంటికి హంగులు కాదు అల్లరిఆటలు కాదు త్రాగుబోతువిందులు కాదు //2// మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ //వచ్చింది// 1. రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు- తిరుమారని జనులు //2//ఇంటికి// 2. విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు //2//ఇంటికి// 3. దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యకా అజ్ఞానులవలేకాకా జ్ఞానులవలే నడవాలి పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా //2//ఇంటికి// || || || || Song info Writer ✍ : Album 📀 : Singers 🎤 : Book 📖 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector