Velpulalo bahu ghanuda yesayya వేల్పులలో బహుఘనుడా యేసయ్యా

Song no: 171

    వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
    నిను సేవించువారిని ఘనపరతువు (2)
    నిను ప్రేమించువారికి సమస్తము
    సమకూర్చి జరిగింతువు. . . .
    నీయందు భయభక్తి గల వారికీ
    శాశ్వత క్రుపనిచ్చేదవు. . . . || వేల్పులలో ||

  1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
    పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
    మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
    ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2) || వేల్పులలో ||

  2. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
    ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2)
    విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
    నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2) || వేల్పులలో ||

  3. పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
    ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2)
    పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
    చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను (2) || వేల్పులలో ||

Blogger ఆధారితం.