Nenu yesuni chuche samayam bahu sameepamayene నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే

Song no: 112
    నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే....

    శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... } 2 || నేను యేసుని ||

  1. అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా } 2
    ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . } 2 || నేను యేసుని ||

  2. రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... } 2
    గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును } 2 || నేను యేసుని ||

  3. అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి } 2
    నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను } 2 || నేను యేసుని ||  
Blogger ఆధారితం.