Naa jeevithana kurisene nee krupamrutham నా జీవితాన కురిసెనే నీ కృపామృతం

Song no: 129
    నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
    నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2
    నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2

  1. నీ దయ నుండి దూరము కాగా
    ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2
    కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
    నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || నా జీవితాన ||  } 2

  2. నా యేసయ్యా - నీ నామమెంతో
    ఘనమైనది - కొనియాడదగినది } 2
    కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
    నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || నా జీవితాన ||  } 2

  3. నీ సన్నిధిని నివసించు నాకు
    ఏ అపాయము దరిచేరనివ్వవు } 2
    కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
    నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || నా జీవితాన ||  } 2

Blogger ఆధారితం.