Nuthana yerushalem na gruhamu yeppudu velli నూతనయెరూషలేం నా గృహము ఎప్పుడువెళ్లి నే చేరెదను

నూతనయెరూషలేం నా గృహము
ఎప్పుడువెళ్లి నే చేరెదను
రారాజునగరమే ఆ పురము రమ్యమైన సీయోనే!
దానిఉన్నత వాస స్థలము
చరణములు

1.స్పటికమువలె బంగారు వీధులు
ముత్యపుగుమ్మముల్ ఆ పట్టణముకు
ధగధగమెరుయును దానిలో వెలుగు
దానిలోచేరుటే నా హృదయ వాంచ (నూతన)

2.క్రీస్తు యేసే మూలరాయిగాను
అపోస్తులేపునాదుల రాళ్లగా కట్టిరి
అమూల్యరత్నములతో అలంకరింపబడె
ఆరమ్య నగరమే నా నిత్యవాసం  (నూతన)

౩.దుఃఖమువేదన కన్నీరే లేదు
ఆదేసమునందు మరణమే లేదు
నాప్రతి బాష్పబిందువు తుడుచున్
నాదేవునితోనే కాపురముండెదన్  (నూతన)

4.ఆ నగరములో ప్రకాశించుటకు
సూర్యచంద్రులుదానిలో లేరు
గొఱ్ఱెపిల్లప్రభుయేసే దానిలో దీపము
పెండ్లికుమర్తెగామహిమలో వసింతున్ (నూతన)

5. సీయోను సౌందర్యం ఆ నగర మహిమ
సీయోనేశాశ్వత శోభాతిశయము
ఆదివ్య పురములో చేర్చుము త్వరగా
ఆకాంక్షతోనేను కనిపెట్టి జీవింతున్ (నూతన)

Blogger ఆధారితం.