అను దిన జీవితనికి కావాలి నీ కృప ఆ కృపలోనే అంతయు వరకు సాగెదను అ.ప. : నీ కృప శాశ్వత కృప నీ కృప అనంత కృప నీ కృప అద్భుత కృప నీ కృప ఆదరించే కృప
1. శోధనలలో వేదనలతో నేను అలసియుండగా శత్రువైన సాతానుడు నన్ను తరుముచుండగా శాశ్వత కృపతో దరిచేరితివి శాశ్వతనందముతో నింపితివి
2. ఈ లోక ఆశలలో ఆకర్షణలో నిన్ను మరచియుండగా ఎండ మావులు చూచి భ్రమతో నేను పరుగిడుచుండగా నీ కృపా బాహుళ్యముతో నన్ను చేరదీసితివి నిత్యమైన నీ కృపతో (నన్ను) హత్తుకొంటివి
3. భూమికంటే ఆకాశము ఎంత ఉన్నమో నీ కృప ఔనత్యము అది నా ఉహుకు ఎంతో అతీతం వర్ణింప నశక్యమా సిలువలో నీ కృప ప్రత్యక్షమాయెను నన్ను రక్షించి నిత్య జీవమిచ్చెను.
0 Post a Comment :
కామెంట్‌ను పోస్ట్ చేయండి