నే పాడగలనా నాపై నీ ప్రేమ ఎంతో

B
ప : నే పాడగలనా - నాపై నీ ప్రేమ ఎంతో నే వర్ణింపగలనా - నాపై నీ కృప ఎంతో యేసయ్య నీ ప్రేమ ఎంతో అందదయ్య నా మదికి యేసయ్య నీ కృప ఎంతో అందదయ్య నా మదికి ॥నే॥

చ విరిగి దానిని నలిగిన దానిని ఎవ్వరు ప్రేమించరిలలో ॥2॥ భక్తిహీనులను శక్తిహీనులను ఆదరించే నీ కృప॥2॥ యేసయ్య నీ ప్రేమ ఎంతో అందదయ్య నా మదికి యేసయ్య నీ కృప ఎంతో అందదయ్య నా మదికి ॥నే॥

చ : జన్మతహః పాపిగా నీ ఆజ్ఞలను నే అతిక్రమించినాను ॥2॥ మరణ పాత్రునిగా నన్ను నీవు ఎంచక నా సిలువను నీవు మోసితివా యేసయ్య నీ ప్రేమ ఎంతో అందదయ్య నా మదికి యేసయ్య నీ కృప ఎంతో అందదయ్య నా మదికి ॥నే॥

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

కామెంట్‌ను పోస్ట్ చేయండి